సూర్య పై సిట్టిబాబు దే పైచేయి!

Thursday, February 15th, 2018, 01:16:07 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం నా పేరు సూర్య. నూతన సంవత్సర కానుకగా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ ఇంపాక్ట్ నెటిజన్ల నుండి మంచి స్పందన సంపాదించింది. ఆ తరువాత గణతంత్ర దినోత్సవం రోజున విడుదలయిన సైనిక సాంగ్ కూడా ఇన్ స్టెంట్ హిట్ గా నిలిచింది. అయితే నిన్న ప్రేమికుల రోజు కనుకగా విడుదలైన ఇందులోని రొమాంటిక్ సాంగ్ ‘అట్టా సూడమాకే’ అనుకున్న స్థాయిలో లేదని బన్నీ ఫ్యాన్స్ ని పూర్తిగా డిజప్పాయింట్ చేసిందని ఇచ్చిన ట్యూన్ కూడా అంత ఇంప్రెస్సివ్ గా లేదని తెలుస్తోంది. అలానే మరోవైపు రాంచరణ్ రంగస్ధలం చిత్రం లోని ‘ఎంత సక్కగున్నావే’ పాట విడుదలయి ఇన్స్టంట్ చాట్ బస్టర్ గా నిలిచి అందరి నుండి మంచి అభినందనలు పొందుతోంది.

దేవి శ్రీ సంగీతం తోపాటు చంద్రబోస్ లిరిక్స్ ఈ పాటకు మరింత ఆకర్షణ తెచ్చాయి. అసలే ఒకవైపు భరత్ అనే నేను తో సూపర్ స్టార్ మహేష్ చిత్ర యూనిట్ కూడా పబ్లిసిటీ స్టార్ట్ చేసేందుకు రెడీ గా వుంది, అలానే మరో వైపు కాలా చిత్ర నిర్మాతలు కూడా త్వరలో ఆ చిత్ర ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ ముక్కోణపు పోటీ మధ్య ఈ విధంగా ఫాన్స్ ను నిరుత్సాహ పరిచిన సూర్య, మిగతా పాటలు, చిత్రం విషయం లో కాస్త జాగ్రత్త వహించాలని, లేదంటే ఈ ముక్కోణపు రేస్ లో వెనుకబడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు….