రామరాజు కోసం ఎదురుచూస్తున్న సీత… ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర యూనిట్

Monday, March 15th, 2021, 12:41:04 PM IST

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబరు 13 న విడుదల కి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్స్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పటి వరకూ కూడా అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్, కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ల ఫస్ట్ లుక్ లతో పాటుగా టీజర్స్ విడుదల అయ్యాయి. ఒళివియా మోరిస్ ఫస్ట్ లుక్ సైతం విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే తాజాగా చిత్ర యూనిట్ అలియా భట్ నటిస్తున్న సీత పాత్ర కి సంబందించి ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది.

రౌద్రం రణం రుధిరం చిత్రం లో అలియా భట్ సీత పాత్ర లో నటిస్తుంది. అయితే ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర యూనిట్ ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రామరాజు కోసం బలమైన సంకల్పం తో సీత ఎదురు చూస్తోంది అని, ఆమె ఎదురు చూపులు ఎంతో గొప్పవి అంటూ చెప్పుకొచ్చారు. అయితే అలియా భట్ లుక్ అభిమానులను కట్టి పడేస్తుంది. అలియా ఫస్ట్ లుక్ కి సంబందించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రం లో వీరి తో పాటుగా శ్రియ శరణ్, అజయ్ దేవగన్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.