గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో మరో కీలక మలుపు.. క్లీన్ చీట్..!

Saturday, October 3rd, 2020, 08:25:43 PM IST

గ్యాంగ్‌స్టర్ నయీం కేసులొ మరో కీలక మలుపు చోటు చేసుకుంది. 2016 ఆగస్టు 8న షాద్‌నగర్ సమీపంలో గ్యాంగ్‌స్టర్ నయీం పోలీసుల చేతుల్లో ఎన్‌కౌంటర్ అయిన అనంతరం అతగాడి దందాలు, దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. అయితే నయీం ఎన్‌కౌంటర్ అనంతరం అతడి ద్వారా బాధింపడిన అనేక మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం నయీమ్ కేసును దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అయితే నయీం ఎన్‌కౌంటర్ తరువాత అతడి అనుచరులపై కేసులు నమోదు చేసిన సిట్ అతడి నేరాలకు సహకరించిన పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే నయీంకు ప్రజాప్రతినిధులతో పాటు పలువురు పోలీసు అధికారులు కూడా సహాయ సహకారాలు అందిచేవారని పెద్ద ఎత్త్గున ఆరోపణలు వచ్చాయి. అయితే నయీంతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్న 25 మంది పోలీసు అధికారులకు తాజాగా సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో వారి పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొంటూ ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలకు సిట్ క్లీన్ చీట్ ఇస్తూ ఇందుకు సంబంధించిన సమాచారం ఫోరం ఫర్ గుడ్ గవర్నెర్స్ సంస్థకు అందించింది.