సింగర్ సునీత కి కరోనా పాజిటివ్…కానీ!

Tuesday, August 18th, 2020, 10:34:55 PM IST

ప్రముఖ నేతలు, ప్రజా ప్రతి నిధులు, సినీ ప్రముఖులు కరోనా వైరస్ భారిన పడుతుండటం మనం చూస్తున్నాం. తాజాగా సింగర్ సునీత కి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు తానే స్వయంగా వీడియో సందేశం ను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఒక కార్యక్రమం కి హజరు కాగా, తల నొప్పి వచ్చింది అని, అయితే తలనొప్పి మామూలు గా అనిపించినా, నిర్లక్ష్యం చేయకుండా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకున్నా అని, అయితే రిపోర్ట్ లో పాజిటివ్ వచ్చింది అని సునీత తెలిపారు.

అయితే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినా కూడా బయటపడ్డా అని, ప్రస్తుతం ఆరోగ్యం గా ఉన్నట్లు తెలిపారు. తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని తెలిపారు. అయితే ఎప్పటికప్పుడు వైద్యులు సలహాలు సూచనలు తీసుకుంటూ, జాగ్రత్త గా ఉన్నా అని, అలా ఉండటం వలనే కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్నట్లు తెలిపారు. అయితే లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కి కరోనా వైరస్ రావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు సునీత. అయితే ఎస్పీ బాలు కరోనా నుండి త్వరగా కోలుకోవాలని కోరారు. అందరూ సురక్షితం గా ఉండండి అని, దేన్నీ తేలికగా తీసుకోవద్దు అని సునీత తెలిపారు.