సింగర్ సునీత ఎంగేజ్మెంట్…వైరల్ అవుతున్న వీడియో

Monday, December 7th, 2020, 01:29:10 PM IST

ప్రముఖ సింగర్ సునీత రెండవ పెళ్లికి సంబంధించి గతం లో సోషల్ మీడియా లో వార్తలు వైరల్ కాగా, వాటిని తోసిపుచ్చారు సునీత. ఇప్పుడప్పుడే రెండవ పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం లేదు అని తేల్చి చెప్పారు. అయితే అనూహ్యంగా అభిమానులకు షాక్ ఇచ్చారు సునీత. వస్తున్న పుకార్లు అన్నిటికీ కూడా సునీత ఇచ్చిన షాక్ తో పుల్ స్టాప్ పడ్డట్లు అయింది అని చెప్పాలి. డిజిటల్ రంగం లో కీలక పాత్ర పోషిస్తున్న బిజినెస్ మెన్ రామ్ విరపనేని తో సోమవారం నాడు ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది. అయితే అతి కొద్దీ మంది సమక్షం లో ఈ ఎంగేజ్ మెంట్ జరిగినట్లు తెలుస్తోంది.

అయితే 19 ఏళ్ల వయసు లో ఇదివరకు పెళ్లి అయిన సునీత కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త పట్ల విసుగు చెందిన సింగర్ సునీత విడాకులు ఇచ్చారు. అయితే ఊహించని రీతిలో సునీత నిశ్చితార్థం జరగడం అభిమానులను షాక్ కి గురి చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో మరియు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, గాయని గా సునీత ప్రస్థానం చాలా గొప్పది అని చెప్పాలి. గత కొద్ది సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో తన గొంతు తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు సునీత. అయితే ఇప్పుడు ఈ నిశ్చితార్థం పట్ల సునీత ఎలా స్పందిస్తారు అనేది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.