కుక్కలకు కరోనా వైరస్ 20 ఏళ్లుగా ఉంది

Friday, May 7th, 2021, 10:04:29 AM IST

తాజాగా హైదరాబాద్ లోని జూ పార్క్ లో సింహాలకు కరోనా వైరస్ సోకింది అంటూ వార్త సోషల్ మీడియా లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే జూ పార్క్ లో 8 సింహాలకు సోకిన వైరస్, మానవులకు సోకిన కోవిడ్ 19 వైరస్ ఒకటి కాదు అని ప్రభుత్వం మల్టీ స్పెషాలిటీ పశువుల వైద్య శాల సూపరింటెందెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు.అయితే సింహాలకు కరోనా అంటూ వార్త విస్తృతంగా ప్రచారం అయిన సంగతి తెలిసిందే. అయితే సార్స్ 2 వైరస్ లలో కోవిడ్ 19 ఒకటి అని చెప్పుకొచ్చారు. అయితే ఈ వైరస్ మనుషులను పీడిస్తుంది కానీ,సింహాలకు వచ్చింది మాత్రం అది కాదు అని స్పష్టం చేశారు. కేంద్రం కూడా నిర్ధారించింది అని వ్యాఖ్యానించారు. అయితే కుక్కలకు కరోనా వైరస్ 20 ఏళ్లుగా ఉందని, టీకాలు వేస్తున్నాం అని, శునకాలకు, జంతువులకు సోకిన వైరస్ మనుషులకు సొకదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల తో పలువురు జంతు ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.