తొలిరోజు విచారణలో సాధారణ ప్రశ్నలే!

Saturday, June 6th, 2015, 09:41:09 PM IST


ఓటుకు నోటు కేసులో తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు శనివారం విచారించారు. ఇక దీనిపై రేవంత్ తరపు న్యాయవాది విలేకరులతో మాట్లాడుతూ ఏసీబీ విచారణలో భాగంగా రేవంత్ రెడ్డిని సాధారణ ప్రశ్నలే అడిగారని, ఎలాంటి డిగ్రీని ప్రయోగించలేదని తెలిపారు. అలాగే మధ్యాహ్నం మొదలుపెట్టిన విచారణలో దాదాపు రెండు గంటల పాటు రేవంత్ రెడ్డిని అధికారులు ప్రశ్నించారని, వాటికి రేవంత్ సమాధానం చెప్పారని ఆయన తెలిపారు.

ఇక ఈ విచారణలో రేవంత్ ను డీఎస్పీ, ఇద్దరు ఎస్ఐలు ప్రశ్నించారని న్యాయవాది పేర్కొన్నారు. ప్రస్తుతం రేవంత్ ను చర్లపల్లి జైలుకు తీసుకెళ్లడం లేదని, సిట్ కార్యాలయానికి తరలిస్తున్నారని, తిరిగి రేపు ఉదయం 9గంటలకు బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తీసుకోస్తారని న్యాయవాది తెలిపారు. ఇక ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు అరెస్ట్ అయిన సెబాస్టియన్, ఉదయ్ సింహాలను అధికారులు విడివిడిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.