మరొకసారి తెరపైకి శింబు – త్రిష పెళ్లి టాపిక్!

Friday, October 16th, 2020, 11:43:27 AM IST

ఏ మాయ చేశావే చిత్రాన్ని తమిళంలో విన్నైతండి వరువాయ చిత్రం తో శింబు మరియు త్రిష లు ఇద్దరు కూడా కలిసి నటించారు. ఈ చిత్రం లో వారి నటనకు, కెమిస్ట్రీ కి మంచి మార్కులే వచ్చాయి. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా మారారు ఈ జంట. అయితే అప్పట్లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు మరొకసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.

లాక్ డౌన్ సమయం లో శింబు మరియు త్రిష మరొకసారి కార్తీక్ డయల్ సేతా యేన్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ కోసం కలిసి పని చేశారు. అయితే ఈ ఏడాది చివరన డిసెంబర్ లో శింబు ఒక శుభవార్త చెబుతా అంటూ ప్రకటనను ఇచ్చారు. అయితే ఇది పెళ్లి గురించి అయి ఉంటుంది అని అందరూ భావిస్తున్నారు. అంతేకాక తమిళ నిర్మాతల మండలి లో శింబు తండ్రి రాజేంద్ర పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఒక విలేకరి శింబు త్రిష ల వివాహం గురించి అడగగా, ప్రశ్న ను దాటవేశారు. మరి శింబు చెబుతా అన్న ఆ శుభవార్త ఏమై ఉంటుందో చూడాలి.