దుబ్బాక ఉపఎన్నిక బరిలో సిద్దిపేట కలెక్టర్!?

Sunday, October 4th, 2020, 02:24:01 PM IST

తెలంగాణ రాష్ట్రం లో దుబ్బాక నియోజక వర్గం లో మరొకసారి ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక ను ప్రతి ఒక్క పార్టీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ సైతం విడుదల అయింది. అయితే అధికార పార్టీ మరొకసారి అక్కడ తన జెండా ను ఎగురవేసెందుకు సిద్దం కాగా, ప్రతి పక్ష పార్టీ లు సైతం ఈ ఎన్నిక తో మరొకసారి తమ సత్తా చాటాలని భావిస్తున్నాయి. అయితే ఈ తరుణం లో అనూహ్యంగా తెర పైకి సిద్దిపేట కలెక్టర్ వచ్చారు.

సిద్దిపేట కలెక్టర్ వెంకట్ రాంరెడ్డి ఈ ఉప ఎన్నికలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మీడియా తో మాట్లాడిన ఆయన, తెరాస పార్టీ నుండి టికెట్ ను ఆశిస్తున్నట్లు చెప్పారు. దుబ్బాక ఉపఎన్నిక లో పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారు అని, రోజుకి వేల సంఖ్యలో మెసేజ్ లు పంపుతున్నారు అని తెలిపారు. అయితే తెరాస పార్టీ నుండి ఇంకా ఎటువంటి సమాచారం లేదు అని, ఒక వేళ అవకాశం వస్టే తప్పక పోటీ లో ఉంటా, ప్రజా సేవ చేస్తా అని కలెక్టర్ తెలిపారు. అయితే ప్రజలు తన పనితనం నచ్చే తనను కోరుకుంటున్నారు కావొచ్చు అని మీడియా తో తెలిపారు. దుబ్బాక ఉపఎన్నిక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారగా, ఇపుడు కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు చర్చంసనేయం గా మారింది.