శృతికి ఎన్ కౌంటర్ షాక్!

Thursday, April 9th, 2015, 04:28:47 PM IST

Shruti-Haasan-30-Km-away-fr
శేషాచలం పర్వత ప్రాంతంలో మంగళవారం పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో 20మంది ఎర్రచందనం స్మగ్లర్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు ఈ ప్రదేశానికి కేవలం 30కిలోమీటర్ల దూరంలో తమిళ నటుడు విజయ్ నటిస్తున్న ‘పులి’ చిత్రం షూటింగ్ జరుపుకుంది. ఇక ఇందులో కధానాయికగా నటిస్తున్న శృతి హాసన్ తన షూటింగ్ లొకేషన్ కు అతి సమీపంగా ఎన్ కౌంటర్ జరిగిన విషయాన్ని తెలుసుకుని షాక్ కు గురైందట.

వివరాల్లోకి వెళితే శేషాచలం అడవుల్లో మంగళవారం సాయంత్రం షూటింగ్ ముగించుకుని తిరుగు ప్రయాణంలో తిరుపతి వస్తుండగా తలకోన చెక్ పోస్ట్ వద్ద చిత్ర యూనిట్ కు ఎన్ కౌంటర్ సంగతి తెలిసిందట. దీనితో కేవలం 30కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ ఉదంతంపై శృతి హాసన్ ఒక్కసారిగా షాక్ కు గురైందని సమాచారం. మరి ఎవరికైనా తాము ఉన్న చోటికి సమీపంగా కాల్పులు జరుగుతున్నాయంటే భయం వేయక మానదుకదా.