షాకింగ్ : విరాట్ కోహ్లీ, తమన్నాలపై పోలీస్ కేసు..అసలు విషయం ఇదే.!

Sunday, August 2nd, 2020, 01:08:22 PM IST

భారత్ క్రికెట్ జట్టు ప్రస్తుత రథసారథి రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అలాగే మన దక్షిణాది స్టార్ హీరోయిన్ తమన్నా లు వారు వారి రంగాల్లో ఎంతలా రాణిస్తున్నారో అందరికీ తెలిసిందే. అలాగే వీరు వారి వృత్తితో పాటుగా పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మీదా కేసు నమోదు చేసిన ఘటన ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది.

ఇక అసలు విషయం ఏమిటంటే తమన్నా మరియు విరాట్ కోహ్లీలు వేరే వేరేగా ఎన్నో యాడ్స్ చేసినప్పటికీ ఇద్దరూ కంబైన్డ్ గా చేసిన యాడ్ మాత్రం “ఎంపిఎల్” కోసం. మొబైల్ ప్రీమియర్ లీగ్ పేరిట ఓ అనధికారిక యాప్ కు వీరు బ్రాండ్ అంబాసిడర్లుగా చేస్తున్నారు. ఇది డబ్బులు పెట్టి గేమ్స్ ఆడుకునే యాప్.

అయితే దీని వల్ల వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ అని అలాగే ఇది అంత సెక్యూర్ కూడా కాదని దీని వల్ల ఇప్పటికే చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారని ముంబై కి చెందిన ఓ సీనియర్ అడ్వొకేట్ వీరు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ను ప్రోత్సాహిస్తున్నారని కేసు ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఇంకా దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.