సృష్టి ఆసుపత్రి పసిపిల్లల అక్రమ రవాణా కేసులో మరో ట్విస్ట్..!

Sunday, August 2nd, 2020, 01:52:05 AM IST


విశాఖ కేంద్రంగా సృష్టి ఆసుపత్రిలో జరుగుతున్న పసిపిల్లల అక్రమ రవాణా కేసులో విచారణ వేగంగా జరుగుతుంది. ఈ నేపధ్యంలో ఈ కేసులో మరికొన్ని అంశాలు బయటకొచ్చాయి. పసిపిల్లల అక్రమ రవాణా కేసులో సృష్టి ఆసుపత్రితో పాటు మరి కొన్ని ఆసుపత్రులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

నేడు సీతమ్మధారలోని పద్మజ ఆసుపత్రిలో సోదాలు జరిపి డాక్టర్ పద్మజను విచారించారు పోలీసులు. అయితే ఆసుపత్రిలో కొన్ని కీలక డాక్యుమెంట్లు లభ్యం కాగా వాటిని స్వాదీనం చేసుకున్నారు. సృష్టి, పద్మజ ఆసుపత్రులతో పాటు మరికొన్ని ఆసుపత్రులలో 10 మంది పిల్లల అక్రమ రవాణా జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.