బిగ్ న్యూస్: జేసీ దివాకర్ రెడ్డి కి మరొక షాక్..!

Tuesday, June 2nd, 2020, 07:16:45 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ నీ విమర్శించే నేతలలో జేసీ దివాకర్ రెడ్డి ఒకరు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పని తీరు ఉన్నది ఉన్నట్లుగా చెబుతూ ప్రతి సారి టార్గెట్ అవుతునే ఉన్నారు. అయితే తాజాగా జేసీ దివాకర్ రెడ్డి కి మరొక షాక్ తగిలింది. జేసీ ట్రావెల్స్ కి సంబంధించిన వాహనాలను సీజ్ చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ టాపిక్ చర్చంషణీయం అయింది అని చెప్పాలి.

అయితే అనంతపురం మాజీ ఎంపీ అయిన దివాకర్ రెడ్డి గతం లో కూడా అధికారులు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. బీ ఎస్ -3 వాహనాలను బీ ఎస్ 4 వాహనాలు గా మార్చి నడుపుప్తున్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇపుడు అవి పూర్తి స్థాయిలో నిర్దారణ కావడం తో మరికొన్ని వాహనాలు సీజ్ అయినట్లు తెలుస్తుంది. అయితే ఇతర రాష్ట్రాల్లో నాగాలాండ్ తో సహా అక్రమ రిజిస్ట్రేషన
లు చేసినట్లు అధికారులు గుర్తించారు. గతంలో 57 వాహనాలను సీజ్ చేయగా, తాజాగా నేడు 54 టిప్పర్ లను సీజ్ చేయడం జరిగింది. అయితే వీటి పేరు మీద మొత్తం 154వాహనాలను అక్రమం గా రిజిస్ట్రేషన్ లు చేసినట్లు అధికారులు తేల్చి చెప్పారు. అయితే త్వరలో ఆ వాహనాలు కూడా సీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.