నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి – శివాత్మిక రాజశేఖర్

Thursday, October 22nd, 2020, 11:20:50 AM IST

తమ కుటుంబం కరోనా వైరస్ భారిన పడినట్లు ఇటీవల ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తన ఇద్దరు కుమార్తెలు కరోనా వైరస్ ను ఎదుర్కొని డిశ్చార్జ్ అయినట్లు కూడా వెల్లడించారు. జీవిత, రాజశేఖర్ లు ఇద్దరూ కూడా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా రాజశేఖర్ ఆరోగ్యం పై కుమార్తె శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

కరోనా వైరస్ తో నాన్న చాలా కష్టంగా పోరాడుతున్నారు అని, చాలా కష్టంగా ఉంది అని, అయితే మీ ప్రార్థన మరియు శుభాకాంక్షల ద్వారా త్వరగా కోలుకుంటారు అని మేము నమ్ముతున్నాం అని పేర్కొన్నారు. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్దించమనీ నేను వేడుకుంటున్నాను అని తెలిపారు. మీ ప్రేమ తో నాన్న బలంగా తిరిగి వస్తాడు అంటూ శివాత్మిక పేర్కొన్నారు.