తెలంగాణాలో కరోనా కలకలం..బాధితుడి ఇంట్లో ఏకంగా అంతమందా?

Sunday, April 5th, 2020, 10:58:00 AM IST

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఎంతలా సంచలనమ్ రేపుతుందో అందరికీ తెలిసిందే. జస్ట్ గత వారం రోజుల్లోనే భారీ ఎత్తున పెరిగిపోయాయి. దానికి కారణం కూడా ఏంటో అందరికీ తెలుసు. మార్కాజ్ కు వెళ్లి వచ్చిన వారి మూలాంగానే చాలా పెరిగిపోయాయి. ఇప్పుడు అలా తెలంగాణాకు చెందిన ఒక వ్యక్తి ఇప్పుడు కలకలం రేపుతున్నాడు.

హైదరాబాద్ కోఠి ప్రాంతానికి చెందిన ఆ వ్యక్తి మార్కాజ్ కు వెళ్లి రాగా అతను కూడా కరోనా వైరస్ ను తెచ్చాడు. అయితే ఈ వ్యక్తి ఇంట్లో ఏకంగా 46 మంది ఉంటారట. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ ఇప్పుడు ఏకంగా 46 మంది ఉన్న ఇంట్లోకే వచ్చింది. అంటే వారికి అంటుకోకుండా ఉంటుందా వారు ఇంకెత మందిని కలిసి ఉంటారు. దీనితో వారికి అందరికీ పరీక్షలు నిర్వహించి వారికి కరోనా టెస్టులు చేసినట్టుగా స్టాంపులు కూడా వేసినట్టు సమాచారం.