దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ లో ఎన్నికల ప్రధాన అధికారి పర్యటన

Tuesday, November 3rd, 2020, 01:05:22 PM IST

దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ పర్యటించారు. లచ్చపేటలో ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, పోలింగ్ సరళిని అధికారులను అడిగి మరీ తెలుసుకున్నారు. అయితే ఈ నేపధ్యంలో మీడియా తో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేసిన విషయాన్ని వెల్లడించారు. అంతేకాక కరోనా వైరస్ మహమ్మారి ఉండటం తో అందుకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటూ, నిబంధనలు పాటించే విధంగా పోలింగ్ నిర్వహిస్తున్నాం అని తెలిపారు. దుబ్బాక లో ప్రశాంత వాతావరణం లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అని అన్నారు. అంతేకాక ఇవిఎంలో సాంకేతిక సమస్యల పరిష్కారం కొరకు నిపుణులను కూడా అందుబాటులో ఉంచిన విషయాన్ని వెల్లడించారు.

అయితే ఉదయం 11 గంటల వరకు దుబ్బాక లో 34.33 శాతం నమోదు అయిన సంగతి తెలిసిందే. సాయంత్రం ఆరు గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం అయిదు నుండి 6 గంటల వరకు కోవిద్ బాధితులు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు.