రామ మందిర నిర్మాణానికి షారుఖ్ 5 కోట్ల రూపాయల విరాళం!?

Saturday, August 8th, 2020, 01:26:05 AM IST


దాదాపు 500 సంవత్సరాల తర్వాత హిందువులు అంతా కలిసి దేశ వ్యాప్తంగా పండుగ చేసుకుంటున్న రోజులు ఇవి. అయోధ్యా రామ మందిర నిర్మాణం కి సంబంధించి ఇప్పటికే ఆగస్ట్ 5 న భూమి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భూమి పూజ జరగగా, కోట్ల భారతీయ ప్రజలు టెలివిజన్ ద్వారా ఈ వేడుకను కళ్ళారా చూసారు. అయితే ఈ నిర్మాణం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు భక్తులు. అయితే ఈ మందిరం నిర్మాణం కొరకు ఇప్పటికే భారీ విరాళాలు వస్తున్నాయి.

ఈ నేపధ్యంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ మందిర నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినట్లు సోషల్ మీడియా లో న్యూస్ వైరల్ గా మారాయి. అయితే దీని పై ఇంత వరకు షారుఖ్ ఖాన్ స్పందించలేదు. షారుఖ్ ఖాన్ కి సంబంధించిన రెడ్ చిలీస్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ కి చెందిన సీనియర్ మేనేజర్ ఒకరు ఈ విషయాన్ని వెల్లడించినట్లు సోషల్ మీడియా లో స్పీడ్ అవుతోంది. షారుఖ్ ఖాన్ పై ఇది వరకే ఇటువంటి పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పై షారుఖ్ స్పందిస్తారో, లేదంటే నిజంగానే విరాళం ప్రకటిస్తా రో చూడాలి.