తెలంగాణ రాష్ట్రం లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కాదా – షర్మిల

Tuesday, February 9th, 2021, 04:04:21 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణ లో పార్టీ ఏర్పాటు అంశం పై, తెలంగాణ లో ను ప్రస్తుతం స్థితిగతుల పై కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ రాష్ట్రం లో రాజన్న రాజ్యం తేవాలనే కోరిక ఉందని షర్మిల వ్యాఖ్యానించారు. అయితే అది ఏ విధంగా ఎప్పుడూ అనే దానిపై చర్చలు జరుపుతున్నాం అని వివరించారు. అయితే లోటస్ పాండ్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియా ద్వారా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే మిగతా జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే తెలంగాణ రాష్ట్రం లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కదా అంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారా విద్యార్థులు ఉచితంగా చదువు కుంటున్నారా అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక రాజన్న రాజ్యం తేవాలి అంటూ పిలుపు ఇచ్చారు. అయితే జగన్ మోహన్ రెడ్డి తన తోడ పుట్టిన అన్న అని,ఆయన ఆశీస్సులు తన పై ఉన్నాయి అని అనుకుంటున్నాను అని అన్నారు. అంతేకాక పార్టీ ఇప్పుడే అవసరం అని భావిస్తున్నా అని అన్నారు. త్వరలో జిల్లా నేతలతో మాట్లాడతా అంటూ చెప్పుకొచ్చారు. అయితే అప్పటికే షర్మిల చేసిన వ్యాఖ్యలకి తెరాస నేతలు కౌంటర్ వ్యాఖ్యలు చేస్తున్నారు.