నిజానికి బాలకృష్ణ నన్ను కొట్టలేదు – సెహరి మూవీ హీరో

Friday, November 20th, 2020, 01:00:36 PM IST

గత కొద్ది రోజులుగా తెలుగు ప్రేక్షకులు, నెటిజన్లు బాలయ్య తీరు పై కామెంట్స్ చేస్తున్నారు. సేహారి చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ లో నటుడు, ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ తీరు సోషల్ మీడియా లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సేహారీ చిత్రం తో హీరో గా పరిచయం అవుతున్న హర్ష కనుమల్లి ను బాలకృష్ణ చేత్తో కొట్టారు. పోస్టర్ ను హీరో పట్టుకోవడం తో చేత్తో కొట్టారు బాలకృష్ణ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది. మేమేస్ పేజ్ లలో బాలకృష్ణ , సెహరి హీరో ల పై మేమెస్ ప్రత్యక్షం అయ్యాయి. ఫోన్ రింగ్ అవ్వగానే స్టేజ్ పై ఉన్న బాలయ్య ఫోన్ ను విసిరి వేయడం తో పాటుగా కరోనా వైరస్ కి వాక్సిన్ కూడా ఎప్పటికీ రాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ. అయితే బాలయ్య తీరు పై సేహరి చిత్రం హీరో వివరణ ఇచ్చారు.

బాలకృష్ణ తీరును తప్పుగా అర్ధం చేసుకున్నట్లు తెలిపారు. నిజానికి బాలకృష్ణ తనను కొట్టలేదు అని తెలిపారు.పోస్టర్ ను ఎడమ చేత్తో పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా బాలయ్య పక్కకు లాగాడు అని తెలిపారు. హీరో గా తొలి చిత్రం కావడం తో ఎడమ చేత్తో పట్టుకోవడం మంచిది కాదు అని, అందుకే చేతిని పక్కకు లాగాడు అని వివరించారు.అయితే అది ఉద్దేశ్య పూర్వకంగా చేసిన పని కాదు అని, బాలయ్య చాలా మంచి వారు అని, కార్యక్రమానికి రావాలని కోరిన వెంటనే ఒప్పుకున్నారు అని తెలిపారు. అయితే నెటిజన్లు క్రియేటివ్ గా మెమ్స్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏదేమైనా బాలకృష్ణ చేసిన పనులు ప్రతి సారి కూడా సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.