సీమాంధ్ర-తెలంగాణ: లగడపాటి ఎగ్జిట్‌ పోల్స్

Thursday, May 15th, 2014, 02:53:23 PM IST

ఆంధ్రా ఆక్టోపస్, మాజీ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎన్నికల ముగిశాక మరోసారి సీన్ లోకి వచ్చారు. ఎన్నికల సర్వేలను విడుదల చేయడానికి ఎలక్షన్ కమిషన్ విధించిన గడువు పూర్తవడంతో, రాష్ట్రంలోని ప్రజలు, రాజకీయ పార్టీలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్, తన సర్వే భుధవారం ఉదయం విడుదల చేశారు. ఈ సర్వే వివరాలు చూసుకుంటే తెలంగాణలో, టీఅర్ఎస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలియచేశాడు. గులాబీ పార్టీకి దాదాపు 50 నుండి 60 అసెంబ్లీ స్థానాలు వస్తాయని అయన జోస్యం చెప్పాడు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ 30 నుండి 40 అసెంబ్లీ సీట్లు మాత్రమే వస్తాయని వెల్లడించారు. పార్లమెంట్ స్థానాలలో కూడా గులాబీ పార్టీదే హవా అని, వారికీ 8 నుండి 10 సీట్లు ఖచిత్తంగా వస్తాయని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం 3 నుండి 5 ఎంపి సీట్లతో సరిపెట్టుకుంటుందని తెలిపారు. ఎప్పటిలాగే మజ్లీస్ పార్టీకి ఒక పార్లమెంట్ స్థానం దక్కుతుందని, అలాగే 8 నుండి 9 అసెంబ్లీ స్థానాలు ఆ పార్టీ కైవసం చేసుకుంటుందని అన్నారు.

అలాగే సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, టీడీపీ, బీజేపీ కూటమికి 115 నుండి 125 అసెంబ్లీ స్థానాలను గెలుస్తుందని తెలిపాడు. తెలుగుదేశం పార్టీకి వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పోటిని ఇవ్వదని, ఆ పార్టీ కేవలం 45 నుండి 55 సీట్లు మాత్రమే సాధిస్తుందని లగడపాటి తెలిపారు. ఇక పార్లమెంట్ స్థానాల వివరాలకి వెళ్తే టీడీపీ, బీజేపీ కూటమికి 19-22 ఎంపీ స్థానాలు వస్తాయని లగడపాటి చెప్పారు. వైసీపీ 3 నుంచి 6 ఎంపీ స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలిపారు.

అలాగే జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి 320 నుండి 330 సీట్లు దక్కగా, యూపిఏకిమత్రం 70 నుండి 80 సీట్లు మాత్రమే వస్తాయని అయన జోస్యం చెప్పారు. ఇక ఈ జోస్యం ఎంత వరకు నిజం అవుతుందో మే 16న తేలనుంది. మే 16న నిరంతర ఎన్నికల ఫలితాల కోసం చూస్తూనే ఉండండి netiap.com.

లగడపాటి సీమాంధ్ర ఎగ్జిట్ పోల్ వివరాలు :

లగడపాటి తెలంగాణ ఎగ్జిట్ పోల్ వివరాలు :

లగడపాటి జాతీయ స్థాయి ఎగ్జిట్ పోల్ వివరాలు :