అఖిల ప్రియ బెయిల్ ను తిరస్కరించిన కోర్టు

Monday, January 18th, 2021, 03:45:03 PM IST

బోయినపల్లి కిడ్నాప్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో అరెస్ట్ అయి, ఏ 1 గా ఉన్న తెలుగు దేశం పార్టీ నేత, మాజీ మంత్రి అఖిల ప్రియ కి కోర్టు లో మరొకసారి చుక్కెదురు అయింది. అయితే ఆమె బెయిల్ పిటిషన్ ను సికింద్రాబాద్ కోర్టు కొట్టి వేసింది. అఖిల ప్రియ కి తరపు న్యాయవాది కోర్టు లో బెయిల్ పిటిషన్ వేశారు. అయితే ఆమె పై అదనపు కేసులు ఉన్నట్లు గా పోలీసులు మెమో ను కోర్టు కి సబ్మిట్ చేశారు. అయితే పోలీసులు మెమో ను దాఖలు చేయడం తో కోర్టు అఖిల ప్రియ బెయిల్ ను కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది.

అయితే సికింద్రాబాద్ కోర్టు తీసుకున్న నిర్ణయం తో అఖిల ప్రియ నాంపల్లి కోర్టు లో బెయిల్ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. కిడ్నాప్ కేసు లో అరెస్ట్ అయిన భూమా అఖిల ప్రియ ప్రస్తుతం చంచల్ గూడా జైలు లో రిమాండ్ ఖైదీ గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. కిడ్నాప్ వ్యవహారం తనకు చుట్టు కోవడం తో సర్వత్రా చర్చంశ నీయం గా మారింది.