ఏపీలో ప్రారంభమైన రెండో దశ పంచాయితీ పోలింగ్..!

Saturday, February 13th, 2021, 08:30:49 AM IST

ఏపీలో నేడు రెండో దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యింది. అయితే దెండో దశలో మొత్తం 3,328 సర్పంచ్‌ స్థానాలు, 33,570 వార్డు సభ్యులకు నోటిఫికేషన్‌ జారీచేయగా అందులో 539 సర్పంచ్‌లు, 12,604 వార్డు సభ్యుల స్థానాల్లో ఏకగ్రీవాలు అయ్యాయి. అయితే నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో మొత్తం మూడు చోట్ల సర్పంచ్‌ స్థానాలకు, అలాగే 149 చోట్ల వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు కాలేదు.

దీంతో ఏకగ్రీవాలు మినహాయించి మొత్తం 2,786 సర్పంచ్‌లకు, 20,817 వార్డు సభ్యులకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. అయితే సర్పంచ్‌ స్థానాలకు 7,507 మంది అభ్యర్థులు, వార్డు స్థానాలకు 44,876 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో దశ పోలింగ్ కోసం మొత్తం 29,304 పోలింగ్‌ కేంద్రాలను ఎస్‌ఈసీ ఏర్పాటు చేసింది. కాగా ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఆ తర్వాత ఫలితాల ప్రకటన ఉంటుంది.