పంచాయతి ఎన్నికల పోలింగ్ లో నోటా…మరోక కీలక నిర్ణయం

Sunday, January 31st, 2021, 02:02:17 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. గ్రామాలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. పార్టీ లకు అతీతంగా జరుగుతున్న ఈ ఎన్నికలు కుడా కీలకం కానున్నాయి. గెలుపు ఓటముల విషయం లో అభ్యర్థుల మధ్యన గట్టి పోటీ ఉంటుంది. అయితే పార్టీ గుర్తులు కాకుండా, ఎన్నికల సంఘం ఇచ్చిన ఓట్ల తో అభ్యర్దులు బరి లో నిలవాల్సి ఉంటుంది. అయితే ఈ సారి ఎన్నికల సంఘం మరొక కీలక నిర్ణయం తీసుకుంది.సాధారణ సార్వత్రిక ఎన్నికలకి, ఇతర ఎన్నికలకు నోటా గుర్తు ఉంటుంది.

అయితే ఈసారి ఎన్నికల సంఘం నోటా గుర్తును పంచాయతీ ఎన్నికలకు కూడా ముద్రించనున్నారు. ఇప్పటి వరకు నోటా కి అంతగా ప్రాధాన్యం లేదు. అయితే గ్రామాల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో గట్టి ప్రభావం చుపించనుంది. నన్ ఆఫ్ ది ఆబో, మనకి పోటీ లో ఉన్న ఏ ఒక్క అభ్యర్ధి కూడా నచ్చకపోతే నోటా కి ఓటు వేయొచ్చు. బ్యాలెట్ పేపర్ లో నోటా గుర్తు ను ముద్రిస్తోంది ఎన్నికల సంఘం. అయితే ఇప్పుడు ఈ అంశం సర్వత్రా హాట్ టాపిక్ గా మారుతోంది.