ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మరొక కీలక నిర్ణయం

Tuesday, January 26th, 2021, 10:37:26 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల కి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తి ఎన్నికల నిర్వహణ కి ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సమయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉన్నతాధికారుల బదిలీ ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి అయిన గోపాలకృష్ణ ద్వివేది మరియు పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్ బదిలీ ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. అయితే ఎన్నికల ప్రక్రియ కీలక దశలో ఉండగా, బదిలీ లు తగవు అని స్పష్టం చేయడం తో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చంశనీయం గా మారింది. అయితే ఈ సమయం లో బదిలీ చేయాలని భావిస్తే ఎన్నికల విధి విధానాలు పాటించాలి అంటూ పేర్కొనడం జరిగింది.

అయితే ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. సుప్రీం కోర్టు తీర్పు కి అనుగుణంగా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తున్నాం అని, ఇప్పటికే నోటిఫికేషన్ ను కూడా రీ షెడ్యూల్ చేయడం జరిగింది అని, ఇలాంటి పరిస్థితుల్లో బదిలీ లు చేయడం సరికాదు అంటూ పేర్కొంది. అయితే కొత్తగా వచ్చిన అధికారులు ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడం లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంది.