నేడు గవర్నర్‌ను కలవనున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ.. ఎందుకంటే?

Friday, January 22nd, 2021, 02:07:21 AM IST


ఏపీలో పంచాయితీ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి సారించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఈ రోజు గవర్నర్‌ విశ్వభూషన్ హరిచందన్‌ను కలవనున్నారు. ఎస్ఈసీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు, అనంతర పరిణామాలను గవర్నర్‌కు నిమ్మగడ్డ వివరించనున్నట్టు తెలుస్తుంది.

అయితే హైకోర్ట్ తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఇదిలా ఉంటే నాలుగు విడతల్లో పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్‌లు విడుదల కానున్నాయి. ఈ నెల 23న తొలిదశ ఎన్నిలకు నోటిఫికేషన్‌ విడుదల కానుండగా ఈ నెల 27న రెండో దశ, ఈ నెల 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఫిబ్రవరి 5,9,13,17 తేదీలలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి.