ఏపీ సీఎస్‌కు మరో లేఖ రాసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ.. మరికొన్ని సూచనలు..!

Monday, February 1st, 2021, 09:12:31 PM IST

ఏపీలో పంచాయితీ ఎన్నికల నేపధ్యంలో ప్రభుత్వానికి, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు మధ్య లేఖల పర్వం కొనసాగుతుంది. తాజాగా సీఎస్‌ ఆదిత్యనాథ్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మరో లేఖ రాశారు. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, డైరెక్టర్లు ఎన్నికలు జరిగే పంచాయితీలకు వెళ్లే సమయాల్లో ప్రైవేట్ వెహికల్స్‌ల్లోనే వెళ్లాలని లేఖలో సూచించారు.

అంతేకాదు ప్రైవేట్ వాహనాలపై కూడా తమ పదవికివి సంబంధించి ఎలాంటి నేమ్ బోర్డ్స్ ఉపయోగించొద్దని లేఖలో నిమ్మగడ్డ సూచించారు. 1994 పంచాయతీరాజ్ చట్టంలోని ఎన్నికల ప్రవర్తనా నియమావళి, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించొద్దని ఎస్ఈసీ సూచించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపధ్యంలో ఎన్నికలు జరిగే పంచాయితీలలో పర్యటించే ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వ వాహనాలను వాడకూడదని ఇదివరకే ఆదేశించారు.