ఏపీ సీఎస్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో లేఖ.. భారీగా అధికారుల బదిలీ..!

Wednesday, February 3rd, 2021, 09:00:49 PM IST

ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్ సీఎస్ ఆదిత్యానాథ్ దాస్‌కు మరో లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల విషయంలో ఇప్పటికే పలువురు అధికారులపై చర్యలు తీసుకుంటున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ తాజాగా మరికొందరిపై చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. గతంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఏకగ్రీవమైన మండలాల్లోని ఎంపీడీవోలను బదిలీ చేయాలని లేఖలో పేర్కొన్నారు.

అయితే ఒక్క చిత్తూరు జిల్లాలోనే 30 మంది ఎంపీడీవోలను బదిలీ చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ సీఎస్‌ను ఆదేశించారు. ఇదిలా ఉంటే పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఇద్దరు కలెక్టర్లు, ఓ ఎస్పీతో పాటు తొమ్మిది మంది అధికారులను బదిలీ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాజాగా 30 మంది ఎంపీడీవోలను బదిలీ చేయాలంటూ లేఖ రాయడంతో కలకలం రేగింది. మరి దీనపై సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.