ఓట్ల లెక్కింపు ప్రక్రియను తప్పనిసరిగా వీడియో తీయాలి – నిమ్మగడ్డ రమేష్ కుమార్

Friday, February 19th, 2021, 01:52:28 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయితీ ఎన్నికలు దశల వారీగా జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకి సంబందించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అదనపు మార్గదర్శకాలను జారీ చేశారు. అయితే అందులో కీలకం గా ఒక అంశం గురించి ప్రస్తావించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను తప్పనిసరిగా వీడియో తీయాలి అని ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. అయితే సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్, వీడియో గ్రఫి, సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని సూచించారు. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేళ విద్యుత్ సరఫరా కి అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు.

అయితే విద్యుత్ సరఫరా కి అంతరాయం కలగకుండా జనరేటర్లు, ఇన్వర్తర్లు ఉపయోగించాలని, ఇతరులను లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించ వద్దు అని స్పష్టం చేశారు. అంతేకాక పది ఓట్ల తేడా ఉన్న చోటే రీ కౌంటింగ్ కి ఆదేశించాలి అని, అంతేకాక ఓట్ల లెక్కింపు సమయం లో సమాచారం లీక్ కాకుండా చూడాలని అన్నారు. అంతేకాక లెక్కింపు కేంద్రాల్లో వీడియో ఫుటేజ్ ను భద్రపరచాలి అని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయం పట్ల రాజకీయ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.