ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో డిసీషన్.. పంచాయతీ ఎన్నికలు రీ షెడ్యూల్

Monday, January 25th, 2021, 05:21:16 PM IST

ఏపీలో పంచాయితీ ఎన్నికల అంశంపై రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న నేపధ్యంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలంటూ ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటికి ఎన్నికల నిర్వహణకు ఆటంకం ఏర్పడింది.

దీంతో మొదటి విడత ఎన్నికలను నాలుగో విడతగా మార్పు చేసి అందుకు కొత్త తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 21న నాలుగో విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. ఇక రెండు, మూడు, నాలుగు విడతల ఎన్నికలను ఒకటి, రెండు, మూడు విడతలుగా మార్చి వాటిని యథాతథంగా ఆయా తేదీలలోనే జరపనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. అయితే కొత్త షెడ్యూల్ ప్రకారం తొలి విడత ఎన్నికలు ఫిబ్రవరి 7న, రెండో విడత ఎన్నికలు ఫిబ్రవరి 13న, మూడో విడత ఎన్నికలు ఫిబ్రవరి 17, నాలుగో విడత ఎన్నికలు ఫిబ్రవరి 21న జరగనున్నాయి.