ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని నియంత్రిస్తాం – నిమ్మగడ్డ రమేష్ కుమార్

Friday, March 5th, 2021, 10:30:56 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మునిసిపల్ ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. అయితే ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని నియంత్రిస్తాం అని వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికల్లో ప్రలోభాల పై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. నగదు రవాణా పై మరింత నిఘా ఉంచుతున్నట్లు వెల్లడించారు. అంతేకాక ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు నిషీతంగా పరిశీలిస్థాయి అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. అయితే ఎన్నికలు జరుగుతున్న చోట్ల ఇప్పటికే పలు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని వెల్లడించారు.

అయితే పంచాయతీ ఎన్నికలు మునుపెన్నడూ లేనంత ప్రశాంత వాతావరణంలో జరిగాయి అని కితాబు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మునిసిపల్ ఎన్నికల్లో సైతం అదే తరహాలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, పలు చోట్ల నామినేషన్ల ఉపసంహరణ విషయం లో పలు పార్టీల మధ్య తగాదాలు రావడం తో ఆ ప్రాంతాల్లో సైతం నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల తో అటు అధికార పార్టీ, ప్రతి పక్షాలు తమ సత్తా చాటేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.