టీడీపీకి బిగ్ షాక్.. నోటీసులు పంపిన ఎస్ఈసీ నిమ్మగడ్డ..!

Friday, February 5th, 2021, 12:27:51 AM IST

ఏపీ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో విడుదల చేయడంపై టీడీపీకి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్ నోటీసులు జారీ చేశారు. పంచాయితీ ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయడంపై వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో ప్రకటించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని, టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో, ముద్రణ, పంపిణీని నిలిపేయాలని అప్పిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే టీడీపీ నేత మద్దిపాటి వెంకటరాజు వివరణపై ఎస్‌ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని, లేకపోతే వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఈసీ తుది నిర్ణయం తీసుకుంటుందని వెంకటరాజుకు ఇచ్చిన నోటీసులో కమీషన్‌ పేర్కొంది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోపై చర్యలుంటాయని, పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలలో మేనిఫెస్టో సరైనది కాదని ఎస్ఈసీ నిమ్మగడ్డ సూచించారు.