పంచాయితీ ఎలక్షన్స్: ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ..!

Tuesday, February 9th, 2021, 12:10:46 AM IST


ఏపీలొ రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే ఏకగ్రీవాలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు నమోదు కావడంతో ఆ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాల ప్రకటనను నిలిపేయాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇటీవల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఏకగ్రీవాలను ప్రకటించవద్దని తేల్చి చెప్పారు.

అయితే తాజాగా గవర్నర్‌తో భేటీ అయిన నిమ్మగడ్డ ఎన్నికల ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై చర్చించారు. గవర్నర్ ఆదేశాల తర్వాత రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలకు ఎస్ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళ, బుధ వారాల్లో ఏకగ్రీవంగా గెలిచిన అభ్యర్థులకు డిక్లరేషన్లు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో 110, గుంటూరు జిల్లాలో 67 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.