ఏకగ్రీవాల పై నిమ్మగడ్డ కీలక చర్యలు

Friday, February 5th, 2021, 12:44:17 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయం లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంతో శ్రద్ద వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏక గ్రీవాల విషయం లో అధికారులు జాగ్రత్త వహించాలి అని ఇప్పటికే సూచించారు. అయితే చిత్తూరు, గుంటూరు జిల్లా లలో ఎక్కువగా ఏక గ్రీవాలు అవ్వడం పట్ల ప్రత్యేక దృష్టి సారించారు నిమ్మగడ్డ. అయితే ఈ రెండు జిల్లాలకు చెందిన ఏక గ్రీవాల పై నివేదిక అందించాలి అంటూ జిల్లా కలెక్టర్ లని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితికి, ఈ రెండు జిల్లాల్లో జరిగిన ఏక గ్రీవాలకు అసలు పొంతన లేదు అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు.

అయితే ఏక గ్రీవాలని ప్రకటించవద్దు అంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. అయితే ఆ జిల్లా లలో జరిగిన ఏక గ్రీవాల పై వివరణాత్మక నివేదిక అందించాలి అంటూ ఆ రెండు జిల్లా ల కలెక్టర్ లని ఆదేశించారు.అయితే ఆ నివేదికలను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటాను అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరించారు. అయితే మొదటి నుండి ఏక గ్రీవాల విషయం లో నిమ్మగడ్డ సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం నివేదికల విషయం లో ఏ మాత్రం తేడా జరిగిన ఇంకా సీరియస్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.