బిగ్ న్యూస్: ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కీలక వ్యాఖ్యలు

Wednesday, January 27th, 2021, 01:41:42 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా ఉండేందుకు, ఎన్నికల్లో అనివార్య ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టు దిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే అధికార పార్టీ చేసిన ఏకగ్రీవాల విజయాల పట్ల నిమ్మగడ్డ రమేష్ కుమార్ దృష్టి సారించారు. ఈ మేరకు రాష్ట్రం లోని కలెక్టర్లు మరియు ఉన్నతాధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశం లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

సుతిమెత్తని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర బలగాలు అంటూ ప్లాన్ బి అంటూ వ్యాఖ్యలు చేయడం తో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వాక్సినేషన్ కొనసాగింపు కి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి అని, ఎన్నికల విధులకు వాలంటీర్ లను దూరం గా ఉంచాలి అంటూ ఆదేశాలను జారీ చేశారు. అయితే ఈ సమావేశం లో పలువురు కలెక్టర్లు ఎన్నికల నిర్వహణ నిధుల గురించి ప్రస్తావించడం జరగింది. అయితే వీటి తో పాటుగా ఏకగ్రీవ ఎన్నిక పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకగ్రీవాలను స్వాగతించండి, కానీ ఎన్నికల నిర్వహణ కే ప్రథమ ప్రాధాన్యం అంటూ చెప్పుకొచ్చారు.అయితే కేంద్ర బలగాలు పై ఇప్పటికే హోమ్ సెక్యూరిటీ ను కోరాం అంటూ ప్లాన్ బి విషయాన్ని వెల్లడించారు.