ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల పై ఎస్ఈసి కీలక ప్రకటన

Tuesday, November 17th, 2020, 03:25:02 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఎప్పుడో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా వైరస్ మహమ్మారి కారణం గా వాయిదా పడిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల ను గతంలో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో నీ పలు పార్టీలకు చెందిన నాయకులు తో సమావేశం అయి స్థానిక సంస్థల ఎన్నికల విషయం లో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ సమావేశం కి వైసీపీ గైర్హాజరు అయిన సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయం పై నిమ్మగడ్డ రమేష్ కుమార్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా వైరస్ పరిస్థితుల తర్వాత పార్టీల అభిప్రాయాలు తీసుకున్న విషయాన్ని వెల్లడించారు. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కి ఆలోచన చేస్తున్నాం అని అన్నారు. అయితే ఎన్నికల నిర్వహణ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. రాజ్యాంగ పరమైన అంశాలను పూర్తి చేయాల్సి ఉంటుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే మరోమారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రం లో హాట్ టాపిక్ గా మారాయి.