ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సమయం లేదు – నిమ్మగడ్డ

Wednesday, March 24th, 2021, 02:00:13 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఇప్పటికే పంచాయిత, మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. అయితే ఇంకా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ విషయం లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రస్తుతం ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు తనకు సమయం లేదని అన్నారు. అయితే హైకోర్ట్ ఆదేశాల మేరకు షెడ్యూల్ జారీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నా అంటూ చెప్పుకొచ్చారు. అయితే నాలుగు వారాల ఎన్నికల కోడ్ నిర్వహించాలి అన్న బాధ్యత ను నెరవేర్చలేను అని వ్యాఖ్యానించారు. అయితే పస్తుతం సిబ్బంది కరోనా టీకా వేయించుకోవడం లో నిమగ్నం అయ్యారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ సమయం షెడ్యూల్ జారీ చేయలేను అంటూ స్పష్టం చేశారు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కుదరదు అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. అయితే కొత్త ఎన్నికల కమిషనర్ భుజ స్కందాల పైనే బాధ్యతలు ఉన్నాయి అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు.