మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పై నిమ్మగడ్డ కీలక ఆదేశాలు!

Thursday, March 11th, 2021, 03:01:31 PM IST

Nimmagadda-Ramesh-Kumar

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 12 నగర పాలికల్లో మేయర్లు, డిప్యూటి మేయర్ల ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేక ఆదేశాలను జారీ చేశారు. కలెక్టర్లు మరియు జేసీ లను ప్రిసైడింగ్ అధికారులు గా నియమించాలని పురపాలక శాఖ కమీషనర్ కి ఆదేశాలను జారీ చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. అయితే రెండు కార్పొరేషన్ లను కలిగి ఉన్న చిత్తూరు మరియు కృష్ణా జిల్లాల పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రిసైడింగ్ అధికారిగాజేసీ రెవెన్యూ ను నియమించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ను ఎత్తి వేస్తున్నట్లు ఎస్ ఈ సీ ప్రకటించారు.

రాష్ట్రం లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది కాబట్టి, ఎన్నికల కోడ్ ఎత్తేసినట్లు తెలిపారు. అయితే ఎన్నికలు జరగాల్సిన 372 పంచాయతీల్లో ఎన్నికల కోడ్ అమలు లో ఉంటుంది అని తెలిపారు. అయితే పురపాలక ఎన్నికల ఫలితాలు 14 వ తారీఖు న వెల్లడించనున్నారు.