వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌కు షాక్ ఇచ్చిన ఎస్ఈసీ..!

Friday, February 12th, 2021, 12:17:10 AM IST


కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌కు ఎస్ఈసీ షాక్ ఇచ్చింది. పంచాయితీ ఎన్నీల ప్రచారంలో జోగి రమేష్ వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్‌ వేస్తే ప్రభుత్వ పథకాలు కట్‌ చేస్తామని, వార్డు మెంబర్‌గా పోటీ చేసినా ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తామన్నారు. సీఎం జగన్‌ ఇస్తున్న పథకాలు తీసుకుంటూ వైసీపీకి వ్యతిరేకంగా ఎలా నిలబడతారంటూ ప్రశ్నించారు. అయితే ఎమ్మెల్యే జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

అయితే దీనిని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ఎన్నికల కమీషన్ మ్మెల్యే జోగి రమేశ్‌పై చర్యలు చేపట్టింది. పంచాయితీ ఎన్నికలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ ఈ నెల 13 వరకు మీడియాతో మాట్లడకూడదని ఆంక్షలు విధించింది. అంతేకాదు ఎవరితోనూ ఎమ్మెల్యే జోగి రమేశ్ సమావేశాలు నిర్వహించరాదని ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని వీటిని పక్కాగా అమలుచేసేలా చూడాలని కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఎస్ఈసీ సూచించింది.