ఏపీలో కార్పొరేషన్ ఎన్నికలపై కీలక ఆదేశాలు జారీ చేసిన ఎస్ఈసీ..!

Tuesday, February 16th, 2021, 06:00:22 PM IST

ఏపీలో పంచాయితీ ఎన్నికల అనంతరం మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే తాజాగా కార్పొరేషన్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎన్నికల్లో బలవంతంగా నామినేషన్ విత్ డ్రా చేయించారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాదు ఎవరైనా నామినేషన్ వేసి స్క్రూట్నీలో ఆమోదం పొందిన అభ్యర్థులు బలవంతంగా విత్ డ్రా అయితే వారు ఆర్వోకు దరఖాస్తు చేసుకోవచ్చని, అలాంటి దరఖాస్తులను కూడా పరిశీలించాల్సిందిగా రిటర్నింగ్ అధికారులకు ఎస్ఈసీ సూచించడమే కాకుండా అలాంటి నామినేషన్లను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులుగా ప్రకటించాలని ఆదేశించింది. పలు రాజకీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదులతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల కమీషన్ ప్రకటించింది.