విమాన ప్రమాదానికి కారణం ఏంటి ?

Monday, March 10th, 2014, 01:04:19 PM IST

Search-for-missing-Malaysia
శనివారం తెల్లవారుజామున మలేషియా ఎయిర్ లైన్స్ విమానం సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. అయితే అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ఇది ఉగ్రవాదుల కుట్రా? విమానానికి సంబందించిన భాగాలు కూడా ఇంకా ఎందుకు లభించలేదు? అంతా మిస్టరీలాగా ఉంది.

దాదాపు రెండు రోజులు గడిచినా, ఈ ఘటనకు సంబందించిన ఒక్క ఆనవాలు కూడా దొరకలేదు. వియత్నాం మీడియా అందించే సమాచరం ప్రకారం 20 విమానాలు, 40 ఓడలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్నిజల్లెడవెస్తున్నాయి. విమానం తలుపుగా భావించే ఓ వస్తువు ఆదివారం ఉదయం కనిపించినట్ట్టుగా వియత్నాం అధికారుల సమాచారం కానీ ఆ వస్తువు ఇంకా వారికీ దొరకలేదంట్టున్నారు.

ఇది ఇలా ఉంటే, ఇద్దరు వ్యక్తులు నకిలీ పత్రాలతో ఈ విమానంలో ప్రయానిస్తున్నారు. ఈ మేరకు విమానం గల్లంతు వెనుక ఉగ్రవాద చర్యలు ఏమైనా ఉన్నాయా అనే కోణం లో కూడా ఇంటర్ పోల్, ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తున్నాయి. అదేకాకుండా, విమానం అదృశ్యం అయ్యే కొద్ది క్షణాల ముందు వెనుదిరిగి రావడానికి ప్రయత్నించినట్టు రాడార్ చూపినట్టు మలేషియా ఎయిర్‌ఫోర్స్ అధికారులు చెప్పారు. ఈ విమానం లో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు.