తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్.. ఎప్పటి నుంచంటే..!

Monday, January 11th, 2021, 04:01:37 PM IST

కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది మార్చి నుంచి దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో కొన్ని రాష్ట్రాల్లో తిరిగి స్కూళ్లు ప్రారంభమమ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ కూడా స్కూళ్ల పున:ప్రారంభంపై కీలక నిర్ణయం తీసుకుంది. నేడు ప్రగతి భవన్‌లో మంత్రులు, కలెక్టర్లతో సమావేశమైన సీఎం కేసీఆర్ స్కూళ్లు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు ఓపెన్ చేయాలని సీఎం కేసీఅర్ అధికారులను ఆదేశించారు. అయితే కేవలం 9వ తరగతి ఆపై తరగతులను నిర్వహించడానికి మాత్రమే కేసీఆర్ ఒకే చెప్పినట్టు తెలుస్తుంది. కాగా స్కూళ్లు తెరిచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.