జగన్ పని తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు..!

Thursday, July 9th, 2020, 07:02:45 AM IST

ప్రస్తుతం ఏపీలో కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులను అత్యద్భుతంగా వై ఎస్ జగన్ సర్కార్ ఎదుర్కొందని చెప్పాలి. మొదట్లో ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ వాటన్నింటినీ నోరు మూయించే విధంగా పనులు చేయించి అదుర్స్ అనిపించుకున్నారు. కానీ ఇలాంటి కష్ట కాలంలో ప్రజలకు మార్గ దర్శకంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వహించడం బాధాకరం.

ఏపీలో కరోనా ఎంటర్ అయ్యినప్పటి నుంచి ప్రతీ ఒక్కరూ మాస్క్ లేకుండా బయటకు రాకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఆ ఉత్తర్వులు జారీ చేసిన అధినేతే వాటిని పాటించకపోతే..?అలాగే ఉంది ఇప్పుడు జగన్ వ్యవహారం. ఈ మధ్య కాలంలో అసలు మాస్కు వేసుకున్న దాఖలాలైతే లేనే లేవు. పబ్లిక్ మీటింగులలో కూడా జగన్ ఎక్కడా మాస్క్ వేసుకోలేదు.

దీనితో జగన్ పై సోషల్ మీడియాలో అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య ప్రజలకు అయితే మాస్క్ లేనందుకు ఫైన్ లు వేస్తున్నారు. చట్టాలు మీకు వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకుని జగన్ మున్ముందు మార్గదర్శకంగా నిలిచే విధంగా నడుచుకుంటారో లేదో చూడాలి.