శశిథరూర్ పై వేటు

Monday, October 13th, 2014, 04:35:01 PM IST

sasithrur
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేరళ తిరువనంతపురం ఎంపి శశిథరూర్ పై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వేటు వేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్చభారత్ కార్యక్రమాన్ని సమర్ధించడం, ప్రధాని మోడిని పొగడ్తలతో ముంచెత్తడంతో.. కేరళ కాంగ్రెస్ పార్టీ ఆయనపై హైకమాండ్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన హైకమాండ్ ఆయనను పార్టీ అధికార ప్రతినిధి పదవినుంచి తొలగించింది. అంతేకాకుండా, సునంద మృతిపై శశిథరూర్ పై ఆరోపణలు వస్తుండటం కూడా ఆయనపై వేటు వేయడానికి ఒక కారణం కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.