సంచలన ప్రకటన: రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన శశికళ..!

Thursday, March 4th, 2021, 01:19:52 AM IST


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అన్నాడీఎంకే బహిష్కృత నేత చిన్నమ్మ శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు పదవుల మీద, అధికారం మీద ఆసక్తి లేదని రాజకీయాల నుంచి తాను పూర్తిగా తప్పుకుంటున్నట్టు శశికళ ప్రకటించారు. అయితే వచ్చే ఎన్నికల్లో డీఎంకేను ఓడించాలంటూ అన్నాడీఎంకే కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ఇందుకోసం కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు.

ఇటీవలే శశికళ జైలు నుంచి విడుదలై మళ్ళీ తమిళనాట అడుగుపెట్టడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నమ్మ పాత్ర ఎలా ఉంటుందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అన్నాడీఎంకేను మళ్లీ ఆమె కైవసం చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. ఇలాంటి క్రమంలో ఆమె ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకోవడం ఇప్పుడు మరో హాట్ టాఫిక్‌గా మారింది.