సర్కారు వారి పాట కోసం భారీ సెట్…జనవరి నుండి షూటింగ్!

Tuesday, December 8th, 2020, 05:34:45 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సరిలేరూ నీకెవ్వరు చిత్రం తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న మహేష్, మరొక హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధం అవుతున్నారు. గీతా గోవిందం లాంటి చిత్రం తో డీసెంట్ హిట్ కొట్టిన దర్శకుడు పరశురామ్ తో మహేష్ కలిసి పని చేస్తున్నారు. అయితే ఈ చిత్రం ఇప్పటికే హీరోయిన్ గా కీర్తి సురేష్ కన్ఫర్మ్ అయింది.

అయితే ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది జనవరి లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే కథ ప్రకారం ఈ చిత్ర షూటింగ్ విదేశాల్లో ఉండాల్సి ఉండగా, కరోనా వైరస్ మహమ్మారి కారణం గా ఆగిపోయింది. అయితే ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ కి పరిస్థితులు అనుకూలించక పోవడం తో హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేయనున్నారు. అయితే అనంతరం జనవరి నుండి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రి లుక్ విడుదల అయింది. అభిమానులను ప్రి లుక్ విపరీతం గా ఆకట్టుకుంది.