అందుకున్న కాంస్యం – ముగిసిన వివాదం

Thursday, December 11th, 2014, 02:07:05 AM IST

kasyam
సరితాదేవి… ప్రముఖ భారతీయ బాక్సర్.. 2014లో జరిగిన 17వ ఆసియా క్రీడలలో రిఫరీ తప్పుడు నిర్ణయం వలన తాను ఓడిపోయానని విలపిస్తూ కాస్య పతాకాన్ని తీసుకునేందుకు నిరాకరించింది. తనకు ఇచ్చిన కాంస్య పతాకాన్ని తీసుకోకుండా… దాన్ని రజత పతాక విజేత జీనా పార్క్ కు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఆ సంఘటనతో షాక్ కు గురయిన జీనా పార్క్ సరితాదేవి మెడల్ ను అక్కడే పోడియం మీద పెట్టేసి వెళ్ళిపోయింది.

ఇక పోడియం పై వదిలేసిన పతాకాన్ని నిర్వాహకులు తమ వద్ద భద్రంగా ఉంచారు. అంతేకాకుండా.. సరితా దేవిపై నిషేధం విధించాలని నిర్వాహకులు అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్యకు ఫిర్యాదు చేసింది. అయితే… తను చేసిన తప్పును మన్నించాలని సరితాదేవి సమాఖ్యను కోరింది. ఇక దేశంలోని ప్రముఖ క్రీడాకారులంతా… ఆమెకు బాసటగా నిలిచారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి సైతం సరితకు బాసటగా నిలుస్తు అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్యకు లేఖ వ్రాశారు. ఇక చివరగా సరితా తన మెడల్ ను స్వీకరించడంతో వివాదం సద్దుమణిగింది.