‘బిజినెస్’ రేసుగుర్రం ‘సరైనోడే’ ..!

Wednesday, January 27th, 2016, 12:33:30 PM IST


అల్లు అర్జున్ బోయపాటి దర్శకత్వంలో సరైనోడు చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సినిమా అంటేనే క్రేజ్ ఉంటుంది. ఇక సినిమాను మాస్ కు నచ్చేవిధంగా తీయడంలో సిద్దహస్తుడు. బోయపాటి తీసిన సింహా, లెజెండ్ చిత్రాలు ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయితే రేసుగుర్రం అనే చెప్పాలి. ఎందుకంటే.. రేసుగుర్రం దాదాపు 53 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక సన్నాఫ్ సత్యమూర్తి విషయం వచ్చే సరికి 50 కోట్లు కలెక్ట్ చేసింది.

అయితే, ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సరైనోడు సినిమా బిజినెస్ విషయంలో ఆ రెండు చిత్రాలను దాటిపోయినట్టు తెలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి నలభై కోట్లకు పైగా బిజినెస్ చేసినట్టు తెలుస్తున్నది. ఇక, కర్ణాటక, తమిళనాడులోను అదే విధంగా బన్నికి మంచి పట్టున్న కేరళలోను ఈ సినిమా బిజినెస్ బాగానే జరిగినట్టు సమాచారం. ఇకపోతే, ఓవర్సీస్ లో కూడా సరైనోడు బిజినెస్ విషయంలో దూసుకుపోతున్నట్టు తెలుస్తున్నది. మొత్తంగా కలిపి 70 కోట్ల వరకు బిజినెస్ చేసినట్టు సమాచారం.

మరి ఇంత పెద్ద ఎత్తున బిజినెస్ అవుతున్న సరైనోడు.. కలెక్షన్ల విషయంలో అదే ఊపు కొనసాగిస్తాడా లేదా అన్నది తేలాల్సిన అంశం. పైగా సరైనోడు సినిమా విడుదలవుతున్న నెలలోనే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, సూర్య 24, మహేష్ బాబు బ్రహ్మోత్సవం చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ పోటీని తట్టుకొని అంత వసూలు చేస్తుందా లేదా అన్నది తెలియాలి అంటే ఏప్రిల్ వరకు ఆగాల్సిందే.