కేజీఎఫ్ సెట్స్ లోకి అడుగు పెట్టిన అధీరా!

Thursday, October 15th, 2020, 03:27:16 PM IST

కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం షూటింగ్ పునః ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ చిత్ర షూటింగ్ మళ్లీ పునః ప్రారంభం కావడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చివరి షెడ్యుల్ ను పూర్తి చేసేందుకు హీరో యశ్ షూటింగ్ లో చేరగా, ఇప్పుడు సిసలైన విలన్ అధీరా పాత్ర తో సంజయ్ సెట్స్ లోకి అడుగు పెట్టారు. అయితే ఈ చిత్ర షూటింగ్ లో నేడు సంజయ్ దత్ పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని త్వరితగతిన పూర్తి చేసి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

అయితే కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియన్ సినిమా గా అంచనాలు లేకుండా వచ్చి, బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. సినిమా వసూళ్లను కూడా భారీ గా సాధించడం తో ఈ చిత్రం ను మరింత నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా అభిమానులను సంతోషం కి గురి చేస్తూనే ఉంది. కేజీఎఫ్ లో అధీర పాత్ర నిడివి తక్కువే అయినా, ఇప్పుడు సీక్వెల్ లో పూర్తి స్థాయిలో సంజయ్ కనిపించనున్నారు. సంజయ్ దత్ షూటింగ్ లో చేరిక తో ఈ సినిమా పూర్తి స్థాయిలో త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు.