పవన్ సినిమా లో మరో క్రేజీ స్టార్ యాక్టర్

Friday, January 15th, 2021, 04:41:28 PM IST

పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ తాజాగా అయ్యప్పన్ కోషియన్ రీమేక్ లో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన సైతం వెలువడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ చిత్రం లో ఇప్పటికే దగ్గుబాటి రానా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మరొక స్టార్ యాక్టర్ నటించేందుకు సిద్దం అయ్యారు. ఆయనే సముద్రఖని. అలా వైకుంఠ పురంలో చిత్రం లో తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన సముద్రఖని, తెలుగు సినిమాల్లో ఈ మధ్య తరచూ కనిపిస్తున్నారు. సంక్రాంతి కి బ్లాక్ బస్టర్ గా నిలిచిన క్రాక్ చిత్రం లో విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు.

అయితే పవన్ కళ్యాణ్ చిత్రం లో నటిస్తున్నట్లు తాజాగా చెప్పుకొచ్చారు. పాత్ర పై ఇంకా పూర్తి క్లారిటీ లేదు అని అన్నారు. త్రివిక్రమ్ పర్యవేక్షణ లో సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే త్రివిక్రమ్ తనకు తన పాత్ర గురించి చెప్పినట్లు తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.