శామ్ సంగ్ కి లక్ష కోట్ల నష్టం .. కారణం ఏంటి ?

Thursday, October 13th, 2016, 02:56:40 PM IST

note7
గెలాక్సీ సీరీస్ సామ్ సంగ్ కంపెనీ లి చాలా పెద్ద ఆస్తి . ఆ సీరీస్ ని నమ్ముకుని సామ్ సంగ్ కొన్ని కోట్ల టర్నోవర్ ని తీసుకుంది. ఇప్పుడు అదే సీరీస్ లోని నోట్ 7 కంపెనీ పాలిట శాపంగా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ ల కంపెనీ తయారీ దారు గా పేరున్న సామ్ సంగ్ కి నోట్ 7 ఫోన్ ల పేలుళ్లు నరకం చూపిస్తున్నాయి. లిథియం-అయాన్ బ్యాటరీ పేలుడు ఫిర్యాదులు చేయడంతో మొదలైన కష్టాలకు సంబందించిన నష్టాలు తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ విషయంలో శాంసగ్ చేసింది చిన్న తప్పిదమే కావొచ్చు కానీ అది ఆ సంస్థ మనుగడనే ప్రశ్నార్థం చేసిందంటే అది అతిశయోక్తి కాదు. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ లో ఇప్పటి వరకు తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తోన్న శాంసంగ్ కు గెలాక్సీ నోట్ 7 కలిగించిన నష్టం దాదాపు లక్ష కోట్లు ఉంటుందట! ఈ ఫోన్ లు పేలిపోతున్నాయి అన్న ఒకే ఒక్క వార్త తయారీ రంగంలో రారాజుగా ఉన్న సామ్ సంగ్ ని దారుణమైన స్థితి కి తీసుకుని వచ్చేసింది. ఈ విషయం కంపెనీ కూడా అంగీకరించడం తో ఇక ఎవ్వరూ శామ్ సంగ్ ని మునుపటిలాగా నమ్మే పరిస్థితి లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 25 లక్షల గెలాక్సీ 7 నోట్ ఫోన్లను రీప్లేస్ చేశారట! అయితే రీప్లేస్ చేసిన ఫోన్ల నుంచి కూడా పొగలు రావటం – పేలిపోవడంతో విమానాల్లో ఈ ఫోన్ ని నిషేధించారు.